ఇరాన్ వాడుతున్నది చాలా చాలా తక్కువ ఖరీదైన అస్త్రాలు..అమెరికా వాడుతున్నది కోట్ల విలువైన యుద్ధ సామాగ్రి.. అమెరికన్ ఆర్థికంగా దెబ్బతీస్తున్నా ఇరాన్..

ఇరాన్ వాడుతున్నది చాలా చాలా తక్కువ ఖరీదైన అస్త్రాలు అని సమాచారం వస్తోంది. తాజాగా ఇరాన్ మీద దాడులకు ఉపయోగించిన రూ. 150 కోట్ల విలువైన యుద్ధ విమానాన్ని ఇరాన్ గగనతలంలోనే కూల్చేసింది.
ఇందుకోసం ఇరాన్ వాడిన ఆయుధం చిన్నసైజు బాణం లాంటిదని చెబుతున్నారు. ఆ పరికరం అంతరిక్షంలోనే శత్రు దేశాలకు సంబంధించిన ఆయుధాన్ని దేన్నైనా కూల్చేస్తుందని ఇరాన్ చెబుతున్నట్లు పలు ఛానళ్లలో సమాచారం వస్తోంది. ఈ రక్షణ వ్యవస్థ పేరు అరాశ్ అంట. అరాశ్ అంటే బాణం అని అర్థం. పూర్వం ఇరాన్ దేశంలో అరాశ్… ది ఆర్చర్ అనే యోధుడు వుండేవాడట. పశ్చిమ దేశాల ప్రభావాన్ని ఇరాన్ దేశం పైన పడకుండా వుండేందుకు అతడు శక్తివంతమైన బాణాలతో పోరాడాడట.

ఈ బాణాన్ని అతడు ప్రయోగించినపుడు మధ్య ఆసియాలోని ఓ నది అవతల వున్న ఓ చెట్టుని తాకిందనీ, అలా తాకడంతోనే అదే సరిహద్దుగా మారిందని ఇరాన్ గాధల్లో వుంది. ఇప్పుడు ఆ పేరుతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ వ్యవస్థను పసిగట్టడంలో అమెరికా విఫలమవడం వల్లనే అత్యంత ఖరీదైన ఆయుధ సంపత్తిని కోల్పోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి…. ట్రంపు మాటలు హడావుడి తప్ప వాస్తవ పరిస్థితుల్లో అలా లేదు అంటు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.