కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా

హైకోర్టులో హైడ్రాకు వరుస ఎదురుదెబ్బలు

కూకట్‌పల్లి భూమి విషయంలో వెనక్కి తగ్గిన హైడ్రా

కోర్టు వివాదంలో ఉన్న 13 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఇటీవలే స్వాధీనం చేసుకున్న హైడ్రా

హైడ్రా అక్రమంగా తమ భూమి ఆక్రమించిందని భూ యజమానులు వేసిన పిటిషన్ విచారిస్తూ, సదరు భూమిని 24 గంటల్లో యధావిధిగా పిటిషనర్లకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

హైకోర్టు ఆదేశాల మేరకు భూమిని స్వాధీనం చేసుకున్న భూ యజమానులు

ఈ అంశంపై న్యాయమూర్తి ప్రశ్నించగా, ఆ భూమి జోలికి తాము వెళ్లడంలేదని తెలిపిన హైడ్రా

మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం పటేల్ గూడాలో ప్రభుత్వ భూమి అని చెప్తూ 28 ఇండ్లు కూల్చేయడానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన బాధితులు

కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా ఎలాంటి నోటీసులు లేకుండా ఇండ్లు ఎలా కూలగొడతారని, ఈ విషయంపై సమగ్ర నివేదికతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ నెల 15వ తేదీకి కేసును వాయిదా వేసిన హైకోర్టు