బ్రేకప్ కోరిందని యువతిని కత్తితో హత్య చేసిన ప్రియుడు..
పంజాబ్లోని మొహాలీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కంపెనీలో పనిచేస్తున్న దింపుల్ (30), హర్జిందర్ సింగ్ (39) గత మూడు సంవత్సరాలుగా ప్రేమ సంబంధంలో ఉన్నట్లు సమాచారం.
అయితే, ఇటీవల దింపుల్ ఈ సంబంధాన్ని ముగించాలని కోరడంతో హర్జిందర్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. కార్యాలయంలోనే ఆమెను వెంబడించి కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
దాడిని అడ్డుకునేందుకు సహోద్యోగులు ప్రయత్నించినప్పటికీ దింపుల్ను కాపాడలేకపోయారు.
అనంతరం హర్జిందర్ సింగ్ తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
https://www.facebook.com/share/v/1F1nFrHLjj/
ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.