టాలెంటెడ్ కొరియెగ్రాఫర్, ఎంటర్ టైనర్ తాజాగా జరిగిన యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాస్పిటల్లో కోలుకుంటున్న అతను ఓ వీడియో రిలీజ్ చేశాడు.
పండు మాస్టర్ వీడియో
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలో పండు మాస్టర్ మాటలు ఫ్యాన్స్ కు బాధ కలిగించేలా ఉన్నాయి. కళ్ల నిండా నీళ్లతో, నొప్పితో అల్లాడుతూనే అతను ఆసుపత్రి నుంచి మాట్లాడాడు.
“తగరపువలసలో ఈవెంట్ చేసుకుని స్టార్ట్ అయ్యాం. నాకు వాంతి వచ్చినట్లు అనిపించింది. ఆనందపురం దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగాం. బయటకు దిగా. కారు ముందుకు వెళ్లి వాంతి చేసుకుంటున్నా. అప్పుడే కోళ్ల లోడ్ తో ఉన్న వ్యాన్ స్పీడ్ గా వచ్చి కారుకు డాష్ ఇచ్చింది” అని పండు మాస్టర్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
రెండు కాళ్లు ఫ్రాక్చర్
”కోళ్ల వ్యాన్ ఢీ కొట్టడంతో మా కారు నాపైకి దూసుకొచ్చింది. కారు నాపై ఎక్కడంతో రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. అప్పుడు నేను అపస్మారక స్థితిలో ఉన్నా. ఏం జరిగిందో అర్థం కాలేదు. హాస్పిటల్లోనే కల్లు తెరిచా” అని పండు యాక్సిడెంట్ జరిగిన తీరును వివరించాడు…
https://www.instagram.com/reel/DZKGczFBCIo/?igsh=b2RqMG94ZHlwcDF2