చైనాకు చెందిన ఒక పారాగ్లైడర్ ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే మేఘాల మధ్య చిక్కుకుపోయి, ప్రాణాలతో బయటపడటమే కాకుండా ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. పారాగ్లైడర్ తన గ్లైడింగ్ను ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బలమైన గాలి సుడిగుండాలు అతడిని నియంత్రణ కోల్పోయేలా చేసి, వేగంగా పైకి దూసుకెళ్తున్న ఒక భారీ క్యుములోనింబస్ మేఘం వైపు లాగేసాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే అతడు సాధారణంగా పారాగ్లైడర్లు వెళ్లే ఎత్తును దాటి, ఊహించని రీతిలో వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. ఆ ఎత్తులో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో శరీరం గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. అన్నింటికంటే ముఖ్యంగా, అంత ఎత్తులో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. శ్వాస తీసుకోవడం అసాధ్యంగా మారినప్పటికీ.. శూన్యంలో మృత్యువుతో పోరాడుతూ అతడు తన స్పృహ కోల్పోకుండా గ్లైడర్ను నియంత్రించేందుకు ప్రయత్నించాడు. ఎలాంటి ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా అంతటి గడ్డకట్టే చలిని తట్టుకుని, బేగంపై ఉండటం ఓవిచిత్రంగానే అనిపిస్తుంది.. అయితే నిజమైన చిత్రమా లేదా ఏ ఐల రూపొందించారు చిత్రం అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియ రాలేదు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.