కంటోన్మెంట్‌లో రూ. 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి..మొన్నే క్రిషాంక్.

6000 ఇందిరమ్మ ఇళ్ల కోసం కంటోన్మెంట్‌లో రూ. 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను కోరిన బీఆర్ఎస్ నాయకులు…

ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలని కలిసి, కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్ట సర్వే నంబర్ 157/1లో ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతూ సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించిన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్

ఈ భూమి చారిత్రాత్మకంగా “పోరంబోకు సర్కారీ” ప్రభుత్వ భూమిగా గుర్తించబడిందని, 1955 నుండి ఉన్న రికార్డులు, 1975-76 భూ ఆక్రమణ చట్టం కింద జరిగిన చర్యలు, అలాగే పలు న్యాయపరమైన విచారణలు ప్రభుత్వ హక్కులను నిరంతరం సమర్థించాయి

8 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించబడింది మరియు దశాబ్దాలుగా న్యాయపరమైన, పరిపాలనా ప్రక్రియలకు లోబడి ఉంది

ఈ భూమిపై ప్రైవేట్ వ్యక్తుల హక్కుల వాదనలను కోర్టులు మరియు రెవెన్యూ అధికారులు పలుమార్లు తిరస్కరించారు

2025లో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇదే భూమిలో 6000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు

ఆ ప్రతిపాదనలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణించారు

అయితే ప్రస్తుతం ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లినట్లు, చుట్టూ ప్రహరీ నిర్మించబడినట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది

దాదాపు రూ.800 కోట్ల విలువైన ప్రజా ఆస్తి, ప్రభుత్వ హక్కులు పదేపదే గుర్తించబడినప్పటికీ, ఎలా ప్రైవేట్ ఆధీనంలోకి వెళ్లింది

భూమి హక్కులు, సరిహద్దులు, స్వాధీనం మరియు ప్రస్తుత స్థితిపై తక్షణ విచారణ చేపట్టాలి.

రెవెన్యూ, సర్వే మరియు న్యాయపరమైన చారిత్రక రికార్డులను పరిశీలించాలి

రెవెన్యూ, సర్వే మరియు న్యాయ శాఖలతో సంయుక్త ధృవీకరణ నిర్వహించాలని కలెక్టర్‌ను కోరిన మొన్నే క్రిషాంక్…