నల్లగొండ : పట్టణంలోని సాగర్ రోడ్ లోని తెలంగాణ కాలనీలో ఓ ఇంట్లో నలుగురు మృతి..
నాలుగు రోజుల క్రితం మృతి చెందినట్టు గుర్తించిన పోలీసులు
మృతదేహాలకు పురుగులు పట్టడంతో ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా హత్య చేశారా అన్న అనుమానాలు
గుర్తు పట్టలేకుండా ఉన్న మృతదేహాలు..
మృతుల్లో భార్యాభర్తలు సుల్తాన్, హసీనా గా గుర్తింపు
లభించని ఇద్దరి గుర్తింపు..
సుల్తాన్ పట్టణంలోని ప్రకాశం బజార్ లో బ్యాగుల వ్యాపారి..
ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్న హసీనా
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్..
పట్టణంలోని తెలంగాణ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతుల్లో భార్యాభర్తలు సుల్తాన్, హసీనా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు ఇంకా తెలియరాలేదు. నల్లగొండ ప్రకాశం బజార్లో సుల్తాన్ బ్యాగుల వ్యాపారం నిర్వహిస్తుండగా, హసీనా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు తెలిసింది…ఘటన ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో నలుగురు మృతిచెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరిస్తున్న పోలీసులు, మృతుల బంధువులు, స్థానికులను విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పడ్డ పోలీస్ అధికారులు..
దుర్వాసనతో బయటపడ్డ దారుణం..
గత మూడు నాలుగు రోజులుగా ఆ ఇల్లు తెరుచుకోలేదు. అయితే, సోమవారం ఆ ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. అత్యంత భయానక దృశ్యం కనిపించింది. ఇల్లంతా దుర్వాసన వస్తూ, నాలుగు మృతదేహాలు పూర్తిగా డీకంపోజ్ (Decomposed) అయి, పురుగులు పట్టిన స్థితిలో కనిపించాయి…
ఆత్మహత్యా? లేక హత్యా?.
ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది సూసైడా లేక మర్డరా అనే కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. వ్యాపారంలో ఏమైనా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా? లేక కుటుంబ కలహాలు కారణమా? అని ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్ (Clues team) సహాయంతో ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, బంధువుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు స్థానిక పోలీస్ అధికారులు వెల్లడించారు..