కార్యకర్తలే కథానాయకులై కదం తొక్కితే ప్రతి బూత్‌లో బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ..కేటీఆర్ .

కార్యకర్తలే కథానాయకులై కదం తొక్కితే ప్రతి బూత్‌లో బీఆర్ఎస్ BRS PAARTI పార్టీకే మెజారిటీ వస్తదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం,ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో కేటీఆర్(KTR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కార్యకర్తలు అత్యంత సీరియస్‌గా తీసుకోవాలన్నారు..

అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. డిజిటల్ రూపంలో పార్టీ సభ్యత్వ నమోదును పెద్దఎత్తున విజయవంతం చేయండిప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డును ఇస్తామన్నారు. ఈ గుర్తింపు కార్డుతో కార్యకర్తలు ఎక్కడికెళ్లినా గౌరవం లభిస్తదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి… ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సబితమ్మ గెలుపు తథ్యమని తేలిపోయింది..
మహేశ్వరంలో బీఆర్ఎస్ కార్యకర్తల జోష్ చూస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ASAMBLI ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిపోయిన భావన కలుగుతోందని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిపోయారని అనిపిస్తోందన్నారు. మహేశ్వరంలో మరోసారి సబితమ్మ గెలుపు తథ్యమని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా . బ్రహ్మాండంగా బీఆర్ఎస్ గెలిచేది పక్కా.. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరేది పక్కా తెలంగాణ నలుదిశలా ఒకే నినాదం మారుమోగుతోంది. అదే కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలే. రాష్ట్రంలో వికాసం పోయింది.. విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలిందన్నారు…