తుంగతుర్తిలో పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ మధ్య పరస్పరం దాడులు..!.పోలీసుల లాఠీచార్జ్.. అర్వపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం..

సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత…

ఎమ్మెల్యే మందుల సామేలు మరియు ఎంపీ చామల మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి వర్గీల మధ్య అంతర్గత పోరు..

ఎమ్మెల్యే తీరుపై పాత కాంగ్రెస్ నాయకుల మండిపాటు..

ఎంపీ చామల, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్ కు వెళ్తుండగా ఎమ్మెల్యే సామేలు వర్గం అర్వపల్లి మండల కేంద్రంలో బులెరో వాహనంపై దాడి..

రాళ్లు, కర్రలతో దాడి, ఎంపీ చామల, దామోదర్ రెడ్డి వర్గీయులకు తీవ్ర గాయాలు

ఈ దాడిలో పోలీసులకు కూడా గాయాలు .

పోలీసుల లాఠీచార్జ్.. అర్వపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం..

ఎమ్మెల్యే సామేలు ఇటీవల ప్రకటించిన తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే సామేలు ఒంటెద్దు పోకడే కారణం అంటూ సీనియర్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… ఇటీవల మండల అధ్యక్షుడు విషయంలో కూడా రోడ్డుపై ధర్నా నిర్వహించిన అధికార పార్టీ నాయకులు.. ప్రస్తుతం వీరి వ్యవహారం చూస్తుంటే వివాదం తారస్థాయికి చేరినట్లే అనిపిస్తుంది…

హైదరాబాద్…

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో అలజడి

మంత్రి కొండా సురేఖకు తెలియకుండా దేవాదాయ శాఖ కమిషనర్‌తో ఎండోమెంట్ రివ్యూ నిర్వహించిన కడియం శ్రీహరి

స్టేషన్‌ఘన్‌పూర్‌ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై హైదరాబాద్‌లో కడియం శ్రీహరి రివ్యూ

దేవదాయ శాఖ మంత్రినైన తనకే తెలియకుండా కడియం శ్రీహరి రివ్యూ చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం

కడియం శ్రీహరిపై స్టేట్‌ కమాండ్‌కి కాకుండా నేరుగా హైకమాండ్‌కి ఫిర్యాదు చేసిన కొండా సురేఖ

తనకు చెప్పకుండా హైకమాండ్‌కి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్‌ గౌడ్ ఆరా

హైకమాండ్‌కు రాసిన లేఖను బహిర్గత పరచొద్దని మంత్రి కొండా సురేఖకు మహేష్ కుమార్‌ గౌడ్‌ సూచన.