నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్..
హైదరాబాద్లో పారిశ్రామికవేత్తలతో కేంద్రమంత్రి భేటీ
హైటెక్ సిటీలో ఇండస్ట్రీ ప్రతినిధులతో ఇంటరాక్షన్
కొండకల్ మేధా బోగీస్ ఫ్యాక్టరీ సందర్శన
మేధా సర్వ్ డ్రైవ్స్ ఫ్యాక్టరీ పరిశీలన..
తెలంగాణ రాజకీయ యవనికపై జాతీయ పార్టీల వ్యూహాత్మక అడుగులు శరవేగంగా పడుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, భాగ్యనగరాన్ని తమ కీలక కేంద్రంగా మార్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు కాలికి బలపం కట్టుకుని వరుసగా క్యూ కడుతున్నారు. నిన్నటివరకు సాధారణంగా సాగిన పర్యటనలు ఇప్పుడు ఒక్కసారిగా పారిశ్రామిక వేగం పుంజుకుని సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.