తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS)ను ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. పాత విధానంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త వ్యవస్థను తీసుకొస్తోంది….
ఈ పథకం ద్వారా నగదు రహిత వైద్య సేవలు, సులభమైన ఆసుపత్రి సేవలు, డిజిటల్ విధానంలో క్లెయిమ్ల ప్రక్రియ అందుబాటులోకి రానుంది…
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈహెచ్ఎస్ లక్ష్యంగా ప్రభుత్వం స్పష్టం చేసింది….
360 ఆసుపత్రులతో ఒప్పందాలు.. సీజీహెచ్ఎస్ రేట్లతో చికిత్స.
ఉద్యోగులకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 360 ప్రముఖ ఆసుపత్రులతో ఈ పథకం కింద ఒప్పందాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఈ పథకంలో అందించే వైద్య చికిత్సలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (CGHS) రేట్లను వర్తింపజేయనున్నారు. దీనివల్ల ఉద్యోగులకు నగదు రహిత (Cashless) వైద్యం మరింత సులభతరం కానుంది.