ఆంధ్ర రాష్ట్రంలోని గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి సంఘటనలకు సమాజంలో తావు లేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుని తప్పులు చేయాలనుకునే వారికి ఎలాంటి రక్షణ ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకు గౌరవం, భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం:హోంమంత్రి వంగలపూడి అనిత
గుంటూరులో మహిళపై హిజ్రాల దాడి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు హోంమంత్రికి గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. ఆడబిడ్డల జోలికి వస్తే ఎంతటివారైనా ఉపేక్షించరాదని హోంమంత్రి స్పష్టం చేశారు.పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా ఉండాలని హోంమంత్రి అనిత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు..
గుంటూరు జిల్లాలోని ఒక ప్రాంతంలో ఓ మహిళను కొందరు దుండగులు రోడ్డుపై బలవంతంగా లాగి, ఆమె బట్టలు చింపేసి …