ఆర్మీ భూముల్లోకి ప్రవేశిస్తే HYDRAA కమిషనర్ రంగనాథ్ను అరెస్ట్ చేయండి.
ఆర్మీ భూముల్లోకి ప్రవేశిస్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయండి
హైడ్రా, పోలీసులు ఎవరొచ్చినా వాళ్ళను తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆర్మీకి సూచించిన తెలంగాణ హైకోర్టు
లోతుకుంటలో ఆర్మీ భూముల్లో జోక్యం చేసుకోవడం పై రెండు రోజుల క్రితం తీవ్రంగా మందలించిన హైకోర్టు
కోర్టు ఆదేశంతో సోమవారం సాయంత్రం హైకోర్టు ముందు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్
మళ్లీ ఆ భూముల జోలికి వస్తే తమకు తెలియజేయాలని ఆర్మీకి సూచించిన హైకోర్టు
రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులపై తమకు నమ్మకం పోయిందని పేర్కొన్న కోర్టు హెచ్చరికలు….
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై సోమవారం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన స్థలంలోకి వెళ్లరాదన్న ఆదేశాలను మూడుసార్లు ధిక్కరించినందుకు అరెస్టు చేయాలని కూడా ఆదేశించింది. ప్రభుత్వ న్యాయవాదుల విజ్ఞప్తితో అరెస్టు ఆదేశాలను విరమించుకున్నప్పటికీ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. .
ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అంశంలో హైడ్రా వెనకడుగు..
కౌంటర్ దాఖలు చేసేందుకు కోర్టును రెండు వారాల సమయం కోరిన హైడ్రా తరఫు న్యాయవాది..
తమ భూమి ఎఫ్టీఎల్లో లేదని రికార్డులు ప్రవేశపెట్టిన ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ సంస్థ..
జూలై 15వ తేదీ నుండి తమకు సమయం కావాలని కోర్టును కోరుతూ వస్తున్న హైడ్రా..
మొదట్లో హడావిడి చేసి వార్తల్లో కథనాలు ప్రచారం చేసుకున్న హైడ్రా, ఇప్పుడు మరింత సమయం కావాలని కోరడం గమనార్హం..