యశోదా హాస్పిటల్‌లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్….

యశోదా హాస్పిటల్‌లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్..

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు చేరుకొని,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంతరం డాక్టర్లని అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.. కేసీఆర్..

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించేందుకు ఎర్రవెల్లిలోని నివాసం నుండి బయలుదేరి హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. కేసీఆర్‌ యశోద ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు..అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. పెద్ది కుటుంబసభ్యులకు కేసీఆర్‌ మనోధైర్యాన్ని అందించారు. కేసీఆర్‌ వెంట మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు పార్టీ నాయకులు ఉన్నారు..రెండు రోజుల క్రితమే యశోద హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్న పెద్దికి ఆదివారం హనుమకొండలోని ఇంట్లో ఉదయం 7 గంటలకు తీవ్రమైన గుండెపోటు రాగా.. ఆయన భార్య స్వప్న వెంటనే దగ్గరలోని రోహిణి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కార్డియాలజిస్ట్‌ మమతారెడ్డి నేతృత్వంలో వైద్యుల బృందం వేగంగా స్పందించి అత్యవసర వైద్యం అందించారు. అత్యవసర సీపీఆర్ అనంతరం మెరుగైన వైద్యం కోసం పెద్ది సుదర్శన్‌ రెడ్డిని గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించారని తెలిసిందే..