రంపచోడవరం మండలంలో విషాదకర ఘటన. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకుని మృతి…!

పోలవరం జిల్లా రంపచోడవరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ముర్రం శివాని..

రంపచోడవరం మండలంలో విషాదకర ఘటన. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరివేసుకుని మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో నేరుగా మాట్లాడిన విద్యార్థిని మృతురాలు కావడంతో.. ఈ ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీకి చెందిన ముర్రం శివాని స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం ఇంటి సమీపంలోని రేకుల షెడ్‌లో ఉరివేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను విచారిస్తూ విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు…