పాకిస్తాన్‌ నీటిలో ప్రతి ఒక్క చుక్కా మా రెడ్‌లైన్‌’ అంటూ భారత్‌కు హెచ్చరించారికా అంటు ట్వీట్.

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య నీటి వివాదం మరోసారి రాజకీయ వేడిని పెంచుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ నిలిపివేసిన నేపథ్యంలో.. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి..’పాకిస్తాన్‌ నీటిలో ప్రతి ఒక్క చుక్కా మా రెడ్‌లైన్‌’ అంటూ భారత్‌ను ఆయన హెచ్చరించారు. భారత్‌ తన వైఖరిని మార్చుకోకపోతే నేరుగా స్పందిస్తామని వ్యాఖ్యానించారు.

శాంతి గురించి మాట్లాడుతూనే.. భారత్‌కు హెచ్చరికలు జారీ చేయడం పాకిస్థాన్‌ రాజకీయాల్లోని ద్వంద్వ వైఖరిపై మరోసారి చర్చకు దారితీసింది. ఓవైపు శాంతిని కోరుకుంటున్నామని చెబుతూనే.. మరోవైపు నీటి విషయంలో ఎలాంటి చర్యనైనా సహించేది లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

అసలు వివాదం?
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్‌, పాక్‌ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. సింధు నదీ వ్యవస్థలోని నీటిని రెండు దేశాలు ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఈ ఒప్పందం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సింధు, జీలం, చీనాబ్‌ నదులను ప్రధానంగా పాకిస్తాన్‌కు, రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులను భారత్‌కు కేటాయించింది. అయితే ఇరు దేశాలకు కొన్ని పరిమిత వినియోగ హక్కులను కూడా ఒప్పందం కల్పించింది. అయితే 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ దాడికి పాక్‌ మద్దతున్న ఉగ్రవాదులే కారణమని భారత్‌ ఆరోపించింది. ఆ తర్వాత పాకిస్తాన్‌పై తీసుకున్న కీలక చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ ‘అబేయన్స్‌’లో ఉంచింది. ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్‌ మొదలైంది.