JB కాలనీలో జరిగిన నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ డైరెక్టర్ రూపారెడ్డి హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం హత్యలు అనుమానితుడు…
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని JB కాలనీలో జరిగిన నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ డైరెక్టర్ రూపారెడ్డి హత్య ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
రాత్రి సమయంలో నివాసంలోకి చొరబడిన దుండగులు రూపారెడ్డిని ఏకంగా 27 కత్తిపోట్లతో అతి దారుణంగా హతమార్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
అసలు ఈ దారుణానికి పాల్పడింది ఎవరు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు.
ఈ ఘటనను పోలీసులు ఒక సవాల్గా తీసుకుని మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలను వేగవంతం చేశారు.
అయితే ఈ కేసుకు సంబంధించి గురువారం వెలుగులోకి వచ్చిన ఒక కొత్త ట్విస్ట్ ఇప్పుడు పోలీసులకే కాదు అందరికీ విస్మయం కలిగిస్తోంది.
హత్య జరిగిన రోజు తన భార్యకు సంబంధించి ఎలాంటి బంగారం గానీ నగదు గానీ పోలేదని కావాలనే ఆమెను హత్య చేశారని భర్త తొలుత పోలీసులకు తెలిపారు. కానీ గురువారం నాటికి తన మాట మార్చిన ఆయన..ఇంట్లో రూ. 1 లక్ష నగదు పోయినట్లు పోలీసులకు కొత్తగా తెలియజేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదట ఎలాంటి చోరీ జరగలేదన్న భర్త ఇప్పుడు లక్ష రూపాయలు పోయాయని చెప్పడం వెనుక అసలు కారణం ఏంటి? ఇది కేవలం దోపిడీ కోసమే జరిగిన హత్యనా? లేక దీని వెనుక వేరే ఏదైనా కారణం ఉందా? ఆ లక్ష రూపాయల కోణంలో పోలీసుల దర్యాప్తు ఏ దిశలో సాగుతుందనేది త్వరలోనే తేలాల్సి ఉంది.