నాగార్జున సాగర్ కుడి కాలువను తెరవాలని ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర పోరాటం చేశారు… కానీ మన మంత్రులకు సిగ్గులేదు..మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి…

నాగార్జున సాగర్ కుడి కాలువను తెరవాలని ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర పోరాటం చేశారు. అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..

కానీ మన మంత్రులకు సిగ్గులేదు.

నల్గొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఎడమ కాలువ కింద ఉన్న రైతుల బిక్షంతోనే బ్రతుకుతున్నారు.

అయినా కనీసం చీము నెత్తురు లేకుండా, తెలంగాణ ఆత్మగౌరవం లేకుండా, గొర్జం లేకుండా ఇద్దరు మంత్రులు బ్రతుకుతున్నారు.

కుడి కాలువకు నీళ్లు ఎట్ల ఇస్తారు.. ఎడమ కాలువకు ఎందుకు నీళ్లు ఇవ్వరు?

తెలంగాణ రైతాంగం, నల్గొండ రైతాంగం తిరగబడితే మంత్రుల లాగులు పగులుతాయి..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దౌర్జన్యంగా నాగార్జున సాగర్ కుడి కాలువను తెరిచి నీళ్లు తీసుకెళ్తున్నాడు

ఇది పూర్తిగా 100 శాతం రేవంత్ రెడ్డి అంగీకారంతోనే ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకెళ్తుంది

ఏపీ వాళ్లు నీళ్లు తీసుకెళ్తుంటే ఎందుకు ఎడమ కాలువకు నీళ్లు వదలడం లేదు, ఎందుకు మా కల్వకుర్తి ప్రాజెక్టుకు నీళ్లు తీసుకోనివ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ మంత్రులు ఒక్కరూ మాట్లాడడం లేదు

బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందేమోనని భయపడి, ఎడమ కాలువ గేట్లు కొంచెం ఎత్తి, ఉ*చ్చ పోస్తే పోయేంత నీళ్లు తెలంగాణ ప్రజలకు ఇస్తున్నారు అన్నారు.

*సూర్యాపేట జిల్లా..*

కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను వివరిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి..

సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, నియోజకవర్గం ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులు.

*మాజీమంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్స్..*

ఈ రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగుతుంది..

ఇది కాలమో.. ఎల్నినో వల్ల వచ్చిన కరువు కాదు..

ముమ్మాటికీ కాంగ్రెస్ సృష్టించిన కరువే..

ఇటువంటి ద్రోహ పూరిత పాలనను చరిత్రలో ఇంతవరకు చూడలేదు..

రైతంగం ఎంత మోత్తుకుంటున్న ఈ ప్రభుత్వానికి దున్నపోతు పై వాన పడ్డట్టున్నది..

పాము తన పిల్లలను తానే చంపుకున్నట్లు.. ఈ కాంగ్రెస్ తెలంగాణ రైతంగాన్ని చంపుతుంది..

ఇవ్వాళ కృష్ణా, గోదావరి నీళ్లు ఎట్లా పోతున్నాయో కేటీఆర్, మేమంతా కళ్ళకు కట్టినట్లు చూపించినం.

సుందిళ్ల, అన్నారం బ్యారేజులు మంచిగున్నాయని.. సెంట్రల్ వాటర్ కమిషనే స్పష్టంగా తెల్చింది..

ఈ 75 రోజుల్లో గోదావరిలో 150 TMC ల నీళ్లను వృధాగా సముద్రం పాలు చేసిండ్రు..

కృష్ణాలో 150 TMC ల నీటిని ఆంధ్రా పాలు

శ్రీశైలం సాగర్ పొంగిపొర్లేలా కృష్ణమ్మ నీళ్లిచ్చింది..

కానీ ఆంధ్ర సీఎం అనధికార ఉత్తరులతో అక్రమంగా నీళ్లను దోచుకు పోయిండు..

ఇది 100 శాతం రేవంత్ రెడ్డి అనుమతితోనే జరుగుతుంది..

కేవలం BRS పార్టీ వత్తిడితోనే సాగర్ గేట్లు కొంతమేరా వదిలిపెట్టిండ్రు..

అధికారులు స్వయంగా రైటంగాన్ని అరుతది పంటలు వేసుకొమ్మని చెప్పిండ్రు..

ఎన్ని నీళ్లిస్తారో స్పష్టంగా ఏ మంత్రి చెప్పలేదు..

ఏ నియంతలు కూడా ఇంత దుర్మార్గంగా పాలించలేదు..

అసలు విషయాలను పక్కదారి పట్టించి కుట్రలు చేస్తున్నారు..

విత్తనాలు, ఎరువులు .కరెంట్, బోనస్ అడుగుతారని మొదట్లోనే మోసం చేస్తున్నారు..

ఉమ్మడి జిల్లా ఇద్దరు మంత్రులకు ఆ పదవులు కాల్వ కింద రైతులు పెట్టిన బిక్షనే..

ఇది రాజకీయంగా చేస్తున్న ఆరోపణ కాదు.. రాష్ట్రంలో రైతాంగం పడుతున్న ఆవేదన..

కుడికాలువకు నీళ్లిచ్చి ఎడమ కాలువకు ఎందుకు ఇస్తలేరని ఇక్కడి మంత్రులకు అడిగే సోయికూడా లేదు..

కాంగ్రేస్ పార్టీకి అధికారం కట్టబెట్టడమే రైతులు చేసిన పాపమా..

కెసిఆర్ నాయకత్వంలో రైతాంగానికి న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం..