భారత్, చైనా, అమెరికాలు తమకు పరిహారం చెల్లించాల్సిందే.. నేపాల్ కొత్త వాదన..!?
సాయం కాదు.. న్యాయం కావాలి! భారత్, చైనా, అమెరికాలపై నేపాల్ సంచలన డిమాండ్..!
హిమాలయ దేశం నేపాల్ ఇప్పుడు ప్రపంచం ముందు ‘క్లైమేట్ జస్టిస్’ పేరుతో కీలక ప్రశ్నను లేవనెత్తింది. తాము చాలా తక్కువ స్థాయిలో కార్బన్ ఉద్గారాలు చేస్తున్నప్పటికీ.. వాతావరణ మార్పుల ప్రభావంతో భారీ విపత్తులను ఎదుర్కొంటున్నామని ఆ దేశం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
“మీరు సృష్టించని సంక్షోభానికి మేమెందుకు మూల్యం చెల్లించాలి?” అంటూ నేపాల్ ప్రశ్నిస్తోంది. ప్రపంచంలో అధిక కార్బన్ ఉద్గారాలు చేస్తున్న దేశాల్లో ముందున్న చైనా, అమెరికా, భారత్ చారిత్రక బాధ్యత తీసుకుని వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని నేపాల్ డిమాండ్ చేస్తోంది..
హిమాలయ దేశం నేపాల్.. ఇప్పుడు క్లైమేట్ జస్టిస్ పేరిట ప్రపంచం ముందు ఓ ప్రశ్న ఉంచింది. వాతావరణ మార్పుల ప్రభావంతోనే తాము భారీ విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలో అత్యధిక కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు చేస్తున్న దేశాల్లో ముందున్న చైనా, అమెరికా, భారత్ తమకు వాతావరణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మూడు దేశాలు చారిత్రక బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ చెబుతున్నారు. .
‘ఇది పర్వత సునామీ’!.
చైనా సరిహద్దులోని రసువా జిల్లాలో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలు నేపాల్‌ను తీవ్రంగా కలచివేశాయి. హిమనదీ ప్రాంతాల్లో మంచు, శిలలు కూలడంతో భారీగా నీరు, బురద, రాళ్లు దిగువ ప్రాంతాలకు దూసుకొచ్చాయి..
ముందస్తు హెచ్చరికలకు అవకాశం లేకుండా ఒక్కసారిగా విరుచుకుపడిన ఈ విపత్తును నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ‘క్యాటస్ట్రాఫిక్ మౌంటెన్ సునామీ’గా అభివర్ణించారు.
వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లో మంచు కరుగుదల వేగవంతమవుతోందని.. దాంతో హిమనదులు, పర్వత వాలులు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని నిపుణుల హెచ్చరికలను ఆయన ప్రస్తావించారు.
‘సాయం కాదు.. పరిహారం కావాలి’
నేపాల్ వాదన ఇప్పుడు మరింత స్పష్టంగా మారింది.
“ఇది దాతృత్వం కాదు.. న్యాయం, పరిహారం. మేం సృష్టించని ప్రపంచ సంక్షోభానికి అంతిమ మూల్యం మేమే చెల్లిస్తున్నాం” అని మంత్రి ఖనాల్ పేర్కొంటున్నారు.
వాతావరణ మార్పుల ప్రభావంతో హిమాలయాల్లో మంచు కరుగుదల, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు పెరుగుతున్నాయని నేపాల్ చెబుతోంది. వరదల కారణంగా మౌలిక వసతులు దెబ్బతినడంతో పాటు.. దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రపంచ వేదికపై నేపాల్ పోరాటం!
ఇకపై వాతావరణ విపత్తుల విషయంలో తమ దౌత్య విధానం ‘సాయం’ నుంచి ‘న్యాయం, పరిహారం’ వైపు మారుతుందని నేపాల్ స్పష్టం చేస్తోంది.
అంతర్జాతీయ భాగస్వాములకు ఇప్పటికే వాతావరణ నష్టపరిహారానికి సంబంధించిన క్లెయిమ్‌ను పంపినట్లు మంత్రి వెల్లడించారు. రాబోయే అంతర్జాతీయ వేదికలన్నింటిపైనా ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తామని తెలిపారు.
తక్కువ కాలుష్యం చేసే దేశాలే ఎక్కువ నష్టపోతున్నాయా?.
వాతావరణ మార్పులకు బాధ్యత ఎవరిది?
నేపాల్ డిమాండ్‌పై భారత్, చైనా, అమెరికాల స్పందన ఎలా ఉండబోతోంది.. నేపాల్ దేశాన్ని ఆదుకోవడంలో భారతదేశం చాలా ముందు ఉందని కూడా ప్రశంసలు అందిస్తున్న వేళ నేపాల్ ఇలా వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత సామాజిక మాధ్యమంలో ఆభిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి