సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
పదేళ్ల పాటు తానే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు.. అవి క్రమశిక్షణ చర్యల కిందికి రావా?
రేవంత్ రెడ్డిపై మంత్రులు, నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు
మంత్రి పొంగులేటిపై, భట్టి భార్య కమీషన్లపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి
దానిపైన ఎందుకు మాట్లాడటం లేదు
చాలా మంది రెడ్లు మాట్లాడితే వారి పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
పలువురు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయి
వారిపై ఏం చర్యలు తీసుకుంటారు? వాటికి ఏం సమాధానం చెబుతారు?
బీసీకి ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా?
నా కూతురిని రేవంత్ రెడ్డి రెచ్చగొట్టాడు.. అందుకే అలా మాట్లాడింది
నా కూతురు మాట్లాడిన వ్యాఖ్యలకు నాపై చర్యలు తీసుకోవద్దు..
* చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ..
నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌పై సురేఖ డైరెక్ట్ అటాక్ చేశారు. ఢిల్లీలో హైకమాండ్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎం అని తనే చెప్పుకుంటున్నాడు. అది ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్ర కేబినెట్లో ఇతర శాఖ మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయి. సీఎంపై మంత్రులు, నేతలు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనని రాజీనామా చేయమని, మరొకటిగాని నాకు ఎవరు చెప్పలేదు. హైకమాండ్‌కు రాతపూర్వకంగా అన్ని వివరాలు తెలియజేశానని తెలిపారు..నా బిడ్డ మాట్లాడితే నాకెందుకు శిక్ష వేస్తారు. రెడ్లలో ఎంతో మంది అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. బీసీకి ఒక న్యాయం ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. అంతా సద్దుమణిగింది అనుకునే తరుణంలో సురేఖ వ్యాఖ్యల అంతరార్దం ఏటంటనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.
నా మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి
నా మీద ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తెలుసు.. అధిష్టానం వాళ్ల గురించి కూడా ఆలోచించాలి
మీనాక్షి మేడంకు నేను చెప్పాల్సింది అంతా చెప్పాను…నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది
తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం
నేను బీసీ మహిళా మంత్రిని.. నా భర్త మున్నూరు కాపు, నేను పద్మశాలి కులం
మా కులం ఓట్లు 16 శాతం ఉన్నాయి
నా మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు
ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా నా శాఖను నిర్వహిస్తున్నాను
ఒకపక్క కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేదు అని గొడవ నడుస్తుంది….నా మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి
నా మీద ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తెలుసు.. అధిష్టానం వాళ్ల గురించి కూడా ఆలోచించాలి
మీనాక్షి మేడంకు నేను చెప్పాల్సింది అంతా చెప్పాను అన్నారు..
ఢిల్లీలో రాజీ మంత్రం బెడిసికొట్టడం వల్లే ఆమె ఇలా మాట్లాడుతుందేమోనని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. మరోవైపు సురేఖపై అధిష్ఠానానికి సీఎం నివేదికను అందజేశారు. సాధ్యమైనంత త్వరగా ఆమె చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. ఈరోజే కొండా సరేఖపై హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది…