రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇవాళ (బుధవారం) లోక్భవన్లో గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు..అసెంబ్లీ ఘటనలో పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతుందన్నారు.
మేం చేసిన తప్పేంటి..?
రూల్స్ కు విరుద్ధంగా తమ ఎమ్మెల్సీలను ఎలా సస్పెండ్ చేశారో గవర్నర్ శుక్లాకు చెప్పామన్నారు కేటీఆర్ . గౌరవ సభ కాదది, కౌరవ సభ, శాసన సభ కాదు.. దుశ్శాసన సభ, అదే విషయాన్ని గవర్నర్కు వీడియోలతో సహా వివరించామన్నారు. సభ బయట అంశాలపై డీజీపీ, సీపీతో గవర్నర్ మాట్లాడతానన్నారని వెల్లడించారు. ఫామ్ హౌస్కు కాంగ్రెస్ గూండాలు ఎలా వెళ్లారో గవర్నర్కు చెప్పామన్నారు. రాహుల్ గాంధీ తరహాలోనే బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాం. మేం చేసిన తప్పేంటి.. తెలంగాణలో పరిస్థితులను గవర్నర్ శుక్లాకు వివరించాం. రాష్ట్రంలో ప్రజలకే కాదు.. ప్రజా ప్రతినిధులకూ అవమానాలే ఎదురవుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.
”రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశాం. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, యూరియా కొరత, రైతు బీమా, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు గవర్నర్కు ఫిర్యాదు చేశాం. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యపై ఫిర్యాదు చేశామని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్స్ వేసుకున్నట్టే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్లాక్ టీ షర్ట్స్ వేసుకున్నాము. బ్లాక్ టీ షర్ట్ తో అసెంబ్లీకి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు.” అని కేటీఆర్ మండిపడ్డారు..