ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు ..!

ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, వచ్చేవారంలో వర్షాల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది..ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం, శనివారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచకించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు..