HPV. వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ఫుల్ 80 లక్షలకు పైగా హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV) వ్యాక్సిన్ డోసులు..
దేశంలో మహిళల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. అత్యంత ప్రమాదకరంగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) నివారణకు ప్రభుత్వం చేపట్టిన జాతీయ హెచ్పీవీ (HPV) వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 80 లక్షలకు పైగా హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV) వ్యాక్సిన్ డోసులను విజయవంతంగా పంపిణీ చేసినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ప్రివెంటివ్ హెల్త్కేర్ చరిత్రలో ఇదొక కీలక మైలురాయిగా మంత్రిత్వ శాఖ అభివర్ణించింది…మహిళల ప్రాణాలను హరిస్తున్న ప్రధాన క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్రముఖమైనది. దీనిని మూలాల నుంచే అరికట్టాలనే లక్ష్యంతో, సరిగ్గా 14 ఏళ్ల వయస్సు నిండిన బాలికలను టార్గెట్ చేస్తూ ఈ దేశవ్యాప్త మెగా క్యాంపెయిన్కు రూపకల్పన చేశారు. భవిష్యత్తులో ఈ మహమ్మారి బారిన పడకుండా యువతను ముందస్తుగా రక్షించడమే ఈ వ్యాక్సినేషన్ ప్రధాన ఉద్దేశం. అయితే, ప్రాణాలను రక్షించే టీకాను సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHCలు), ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ సింగిల్ డోస్ హెచ్పీవీ వ్యాక్సిన్ను ఎలాంటి రుసుము లేకుండా పూర్తిగా ఫ్రీగానే అందిస్తున్నారు..