మఠంపల్లి మండల పరిధిలో గల రఘునాథపాలెం గ్రామంలో నూనె గింజల ఉత్పత్తి పెరుగుదలపై అవగాహన సదస్సు మండల స్పెషల్ ఆఫీసర్ గారు, మండల వ్యవసాయ అధికారి గారు,కేవీకే సైంటిస్ట్లు నరేష్, కిరణ్ గారు, ఆత్మ చైర్మన్ గారు, ఆత్మ ఏటీఎం, ఏవోఓలు, బీఎస్సీ విద్యార్థులు, రైతులు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ఎల్ నీనో లో ప్రభావం వల్ల వర్ష భావ పరిస్థితుల్లో దృష్ట్యా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా అరుతడి పంటలైన కందులు పెసలు, మినుములు ,జొన్నలు వేరుశనగలు మరియు ఉద్యాన పంటలైనటువంటి కూరగాయలు పండ్లు పూల తోటలు మునగ తోటలో మరియు ఆయిల్ పామ్ పంటలు వేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ ఈ ప్రత్యామ్నాయ పంటలకు ఉద్యానవన శాఖ నుంచి అందిస్తున్నటువంటి వివిధ రకాల రాయితీ పథకాల గురించి వివరించడం జరిగింది. కూరగాయ పందిరిలకు , డ్రిప్పు, స్ప్లింక్లర్స్ కు మరియు కూరగాయ విత్తనాలకు మరియు నారుకు అందిస్తున్న వివిధ రకాల రాయితీలను ఉపయోగించుకొని అధిక దిగుబడులు పొందవలసిందిగా కోరడం జరిగింది, అలాగే ప్రభుత్వ అందిస్తున్న విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.