వీడియో ఫోటోగ్రాఫర్స్ భవనానికి విరాళం..

దేవరకొండ ………
దేవరకొండలో నూతనంగా నిర్మించబడుతున్న దేవరకొండ వీడియో మరియు ఫోటోగ్రాఫర్స్ ల భవనముకు తన వంతుగా 50 000 రూపాయలు విరాళంగా ప్రకటించిన 17 వ వార్డు బి ఆర్ ఎస్ కౌన్సిలర్ మరియు సీనియర్ ఫోటోగ్రాఫర్ పొట్ట మధు 50 000 విరాళం ప్రకటించినందుకు గాను దేవరకొండ ఫోటోగ్రాఫర్లు 17 వ వార్డు కౌన్సిలర్ పొట్ట మధు ను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేసినారు.
ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వీడియో మరియు ఫోటోగ్రాఫర్ భవనానికి తమవంతుగా విరాళాలు ప్రకటించి ఇవ్వాలని అందరు ఫోటోగ్రాఫర్లు విరాళాలు త్వరగా ఇచ్చినచో భవనం త్వరగా పూర్తి అవుతుంది అని తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో జయ రాములు, భాస్కర్, సింధు స్టూడియో శ్రీనివాస్, మణిదీప్,ఎల్ ఐ సి ఆంజనేయులు, రిషి, గోపాల్, కంబాలపల్లి ఆంజనేయులు, హరిబాబు, సలీం, హనుమంతు, మంజునాథ్, శివ తదితరులు పాల్గొన్నారు.