ముంబైలో జరిగిన 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ, జాతీయ గేయం ‘వందేమాతరం’ పూర్తి వైభవాన్ని పునరుద్ధరించడానికి దాదాపు 80 ఏళ్లు పట్టిందని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఈ గేయం అత్యంత కీలక పాత్ర పోషించిందని, భారతీయ సాంస్కృతిక చైతన్యంతో మరియు జాతీయ అస్తిత్వంతో ఇది అమితంగా ముడిపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలూ వందేమాతరాన్ని ఆలపించాల్సిందేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు..భారతీయ భాషల ప్రోత్సాహాన్ని సాంస్కృతిక జాతీయవాదంతో అనుసంధానించిన కేంద్ర మంత్రి, మన దేశ సంస్కృతి , ఘనమైన చరిత్రపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. దేశంలోని భాషా వైవిధ్యాన్ని భిన్నత్వంగా గాక, దేశ ఐక్యతకు మూలమైన గొప్ప బలంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతన విద్యా విధానం (NEP) ప్రాముఖ్యతను వివరించిన అమిత్ షా, దీనిపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. విద్యార్థులు తమ మాతృభాషతో పాటు మరొక భారతీయ భాషను నేర్చుకోవాలని ప్రోత్సహించే విద్యా విధాన నిబంధనను సమర్థిస్తూ, ఈ నిబంధనను వ్యతిరేకించేవారు పెద్ద పాపం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విద్యా విధానం ఉద్దేశం ఏ ఒక్క నిర్దిష్ట భాషనూ బలవంతంగా రుద్దడం కాదని, భారతీయులందరూ ఒకరి భాషలు, సంస్కృతుల పట్ల పరస్పర అవగాహన, ఆప్యాయతలను పెంపొందించుకోవడానికేనని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానం ద్వారా ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించడాన్ని తప్పనిసరి చేసిందని తెలిపారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.