హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా, ఎన్నికల్లో కొట్లాడటానికే సిద్ధం…దానం నాగేందర్..

తెలంగాణ హైకోర్టు తనపై అనర్హత వేటు వేస్తూ ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన కూడా లేదని, ఎన్నికల్లో కొట్లాడటానికే సిద్ధమవుతానని వెల్లడించారు…

హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నానని తెలిపారు. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని ఆయన వివరించారు. ప్రజాక్షేత్రంలోనే, ఎన్నికల్లోనే పోరాడతామన్నారు. ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్త కాదని దానం వివరించారు. పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చినవాడినని తెలిపారు.

మిగిలిన 8 మందిపైనా అనర్హతవేటు పడేవరకు పోరాటం

దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు. పార్టీ ఫిరాయించిన మిగితా వారికీ ఇదే పరిస్థితి పడుతుందన్నారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి విజయం లభించిందన్నారు. అమ్ముడుపోతే అనర్హత తప్పదని తాము గతంలోనే చెప్పామన్న కౌశిక్ రెడ్డి, హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ అని పేర్కొన్నారు. మిగిలిన 8 మందిపైనా అనర్హత వేటు పడేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని కౌశిక్రెడ్డి తెలిపారు. అధికారం ఉందని విర్రవీగితే ఎదురుదెబ్బలు తప్పవని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో.. చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.