రాష్ట్రానికి రూ. 20,000 కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీని అందించాలని కోరుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కీలక తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం..!
రాష్ట్రానికి రూ. 20,000 కోట్ల ప్రత్యేక సహాయ ప్యాకేజీని (Bhatti Vikramarka) ప్రకటించాలని కోరుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కీలక తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
కరువు నివారణ చర్యలపై :
శాసనసభలో ఎల్నినో ప్రభావం, కరువు నివారణ చర్యలపై జరిగిన స్వల్పకాలిక చర్చ ముగింపు సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సాధారణం కంటే గణనీయంగా లోటు వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం భారీగా తగ్గిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగునీటి అవసరాలు, చెరువుల పునరుద్ధరణ మరియు కరువు నివారణ చర్యల నిమిత్తం కేంద్రం తక్షణమే రూ. 20 వేల కోట్లు విడుదల చేయాలని తీర్మానంలో స్పష్టం చేశారు.