ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండి పోతున్నాయి.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి….

*సూర్యాపేట జిల్లా..

సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని పెన్ పహాడ్ మండలం నూర్జహన్ పేట, గూడెపుకుంట తండా గ్రామాలలో ఎండిన పంటపొలాలను సందర్శించి.. రైతులతో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకొని.. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
అలాగే చీదెళ్ల సబ్ స్టేషన్లో లాగ్ బుక్ ను పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడిన జగదీష్ రెడ్డి..

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..

రైతులకు పంటలను దూరం చేస్తున్న పాపం కాంగ్రెస్ దే..

ఏ గ్రామంలో చూసినా వందల ఎకరాలు ఎండిపోయినయ్..

కాలం పరిస్థితి చూసే రైతులు సగం పొలాలే నాటుపెట్టుకున్నరు..

అందులోనూ సగం పైన పంటలు ఎండిపోయే పరిస్థితి..

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లుంది.. ఈ ప్రభుత్వం పాలన తీరు..

నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉన్నా.. పంటలు ఎండబెడుతుండ్రు..

ఉన్న కరెంటును కూడా సరిగ్గా ఇవ్వలేక మోటర్లు కాలిపోయే దుస్థితి..

రైతుల పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తుంది..

పంటలు చేతికొచ్చే సమయంలో కావాలనే ఎండబెడుతున్నరు..

మీడియా సంస్థలు మీ విలేకరులను గ్రామాలలో తిప్పి సమాచారం తెలుసుకోండి..

ఉన్న వాస్తవాలనే ప్రజలకు చూపే ప్రయత్నం చేయండి..

రైతాంగం విషయంలో రాజకీయాల అవసరం లేదు..

రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదు..

ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ దయ్యం, రేవంత్ భూతం పట్టింది..

ఆ దయ్యాలు, భూతాలను ఎట్లా వదిలించాలో రైతులకు తెలుసు..

ప్రశ్నిస్తే తప్ప ఈ ప్రభుత్వానికి కనికరం ఉండదు..

కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకొని పదేండ్లు సస్యశ్యామలంగా పంటలు పండించుకున్నం..

మరో మారు పంటలు కాపాడుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలి..

24 గంటలు కరెంటు ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి..

కన్నేపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినా నీళ్లు సరిపడా ఉన్నాయి..

ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రులను హెచ్చరిస్తున్నా..

ఇదే పరిస్థితిలో కొనసాగిస్తే రైతులు మీ వెంట పడటం ఖాయం..

కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద, నా మీద దాడులు చేస్తే ఎండిపోయిన పొలాలు మర్చిపోతయా..

మీ డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజల ఇబ్బందులు తొలిగిపోతాయా..

ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పంటలకు నీళ్లు, కరెంట్ పై దృష్టి పెడితే మంచిది..

లేనిపక్షంలో ఈ ప్రభుత్వం పైన, రైతుల పక్షాన BRS పోరాటం తప్పదు..