బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి నైరుతి దిశలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో 24 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పరిస్థితి గమనించిన ప్రభుత్వం, SDRF, NDRF బృందాలను రెడీ చేసింది..
బంగాళాఖాతంలో వాయుగుండం ఉగ్రరూపం దాల్చింది. కళింగ పట్నానికి నైరుతి దిశలో అర్థరాత్రి తీవ్రవాయుగుండం తీరం దాటింది. గత అర్ధరాత్రి 11 గంటల తర్వాత తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకింది.. తీరాన్ని తాకిన తర్వాత.. ఈ ప్రక్రియ 3 గంటల పాటు కొనసాగింది. కొన్ని గంటల అనంతరం తీవ్రవాయుగుండం తీరాన్ని దాటింది. తీరం దాటినప్పటికీ తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ గుర్తించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. భారీ వర్షాలతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉందని తెలిపింది. ఈనెల 27 వరకు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు చేసింది..
అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద తీరం దాటింది. తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఆ సమయంలో గాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు విరిగిపోయాయి, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. శ్రీకాకుళంతోపాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఫలితంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు…
తుఫాన్ తీరం దాటినప్పటికీ.. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నేడు కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. అలాగే.. తెలంగాణలో కూడా మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో సెలవులు ప్రకటించారు.