చిట్యాల రైల్వే స్టేషన్ లో దారుణ ఘటన.. నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో అస్వస్థత కు గురైన వ్యక్తి. చిట్యాల రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ పై వదిలి పెట్టీ వెళ్లిపోయిన ట్రైన్ సిబ్బంది.

నల్లగొండ జిల్లా :

* నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ లో అస్వస్థత కు గురైన వ్యక్తి.

* చిట్యాల రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ పై వదిలి పెట్టీ వెళ్లిపోయిన ట్రైన్ సిబ్బంది.

* అంబులెన్స్ కి సమాచారం ఇచ్చి గంట గడుస్తున్న స్పందించని 108 సిబ్బంది.

* సిపిఆర్ చేసి రక్షించే ప్రయత్నం చేస్తున్న స్థానికులు, కుటుంబ సభ్యులు.
ప్రవేట్ వాహనం లో స్థానిక కామినేని హాస్పిటల్ తరలిస్తుడగ మార్గం మధ్యలో నే మృతి చెందిన నెల్లూరుకు చెందిన 41సo”రాల వెంకటేష్

* హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళుతుండగా అస్వస్థతకు గురి కావడం తో చైన్ లాగి ట్రైన్ ఆపినట్లు సమాచారం.

అయితే ప్రాణాపాయంలో ఉన్న వెంకటేష్‌కు వెంటనే వైద్యం అందాల్సిన సమయంలో.. రైలు సిబ్బంది అతడిని ప్లాట్‌ఫామ్‌పైనే వదిలి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రాణం కోసం వెంకటేష్‌ పోరాడుతుండగా.. సహాయం కోసం కుటుంబ సభ్యులు ఆందోళనగా ఎదురుచూడాల్సి వచ్చింది.

108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చినా గంట గడిచిపోయినా స్పందన లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దీంతో స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులే వెంకటేష్‌కు సీపీఆర్‌ చేశారు. ఆటోలో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు…। ఓ వైపు ప్లాట్‌ఫామ్‌పై చావుబతుకుల మధ్య వెంకటేష్‌ కొట్టుమిట్టాడుతుండగా.. సాయం కోసం కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలచివేశాయి. అత్యవసర సమయంలో సకాలంలో వైద్యం అందితే పరిస్థితి మెరుగుపడేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.