ఈరోజు నుండి మూడురోజుల పాటు జరగాల్సిన బ్యాంక్ సమ్మె వాయిదా…!

ఈరోజు నుండి మూడురోజుల పాటు జరగాల్సిన బ్యాంక్ ఎంప్లాయిస్ సమ్మె వాయిదా…

*• సోమ, మంగళ , బుధవారాల్లో జరగాల్సిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన యునైటెడ్ ఫొరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్*

శనివారం శెలవుపై UFBU – IBA కలిసి ఉన్నతస్ధాయి కమిటి..

కమిటి నిర్ణయం తరువాత సమ్మెపై తదుపరి కార్యాచరణ ఉంటుందన్న బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్స్ ..

నేటి నుండి యధావిదిగా పని చేయనున్న బ్యాంకులు…

నేటి నుంచి మూడు రోజుల పాటు తలపెట్టిన బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. ఆదివారం రాత్రి ఐబిఎ, యుఎఫ్‌బియు మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. శనివారాల సెలవు డిమాండ్‌పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు హామీ లభించడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు…

. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు సమ్మె జరగాల్సి ఉండగా దానిని వాయిదా వేసుకున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UBFU- బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక) ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో సోమవారం నుంచి యథావిధిగానే బ్యాంకింగ్ కార్యకలాపాలు జరగనున్నట్లు స్పష్టం చేసింది. ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో (IBA- భారతీయ బ్యాంకుల సంఘం) కీలక చర్చలు ఫలప్రదం కావడంతో ఈ మేరకు సమ్మె వాయిదా నిర్ణయం తీసుకున్నాయి..