రాష్ట్రంలో 17శాతం వర్షం తక్కువ పడింది-పొంగులేటి.
ఎల్‌నినోపై సబ్ కమిటీలో రిపోర్ట్ తయారు చేయాలి..
అఖిలపక్షం సమావేశం తర్వాత ఢిల్లీ వెళ్తాం..
కొన్నిప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు అవుతున్నాయి..
వర్షాలు పడే అవకాశం లేదని చెబుతున్నారు..
విద్యుత్ వినియోగం బాగా పెరిగింది,,.
22A అంశంలో లేఅవుట్లు, భవనాలకు అనుమతులపై..
వచ్చే కేబినెట్లో చర్చిస్తాం..
తెలంగాణ కేబినెట్ నిర్ణయాల్లో ముఖ్యాంశాలు.
2024 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు ఆమోదం..
డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లింపు..
రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం..
17 శాతం వర్షపాతం లోటుపై కేబినెట్ చర్చ..
సుమారు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులపై సమీక్ష..
కరువు పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం..
రైతు సంఘాలు, నిపుణులతో సంప్రదింపులు..
కేంద్ర సాయం కోరేందుకు నిర్ణయం..
ఢిల్లీకి మంత్రుల బృందం వెళ్లే అవకాశం..
65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు,,
విద్యుత్ పీక్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరడంపై చర్చ..
7,800 మెగావాట్ల కొత్త విద్యుత్ సామర్థ్యానికి ప్రణాళిక..
3,000 మెగావాట్ల సోలార్, 4,000 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్, 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు
కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ పనులకు వేగం
10 అసంపూర్తి ఈపీసీ సాగునీటి ప్రాజెక్టుల నిలిపివేతకు ఆమోదం
తెలంగాణ భవన్లో డిప్యూటీ కమిషనర్ పోస్టు
ఢిల్లీలో నలుగురు గ్రూప్-1 అధికారుల నియామకం
ప్రత్యేక డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్ పాలసీకి ఆమోదం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను విడుదల చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉద్యోగ, పెన్షనర్ వర్గాలకు ఊరట లభించనుంది. డీఏల అమలుతో రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. డీఏలకు సంబంధించిన బకాయిలను విడతల వారీగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండు విడతలను విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఈ నిర్ణయం వర్తించనుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో రెండు డీఏల విడుదలపై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కేబినెట్ ఆమోదంతో ఈ నిర్ణయానికి అధికారికంగా ముందడుగు పడింది. డీఏ బకాయిలన్నింటినీ ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, పీఆర్సీ వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ ఏడాది తెలంగాణలో నైరుతి రుతుపవనాల సీజన్ సాధారణం కంటే సుమారు 17 శాతం తక్కువ వర్షపాతంతో ముగిసినట్లు ప్రభుత్వం తెలిపింది. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావం, కరవు తరహా పరిస్థితులు నెలకొన్నట్లు కేబినెట్లో చర్చ జరిగింది. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో ఏర్పడిన వర్షపాతం లోటుపై కేబినెట్ సబ్‌కమిటీ చర్చించి తక్షణ ఉపశమన చర్యలపై నివేదిక సిద్ధం చేయనుంది. రైతు సంఘాలు, వాతావరణ నిపుణులతోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు.
అలాగే కరువు పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రానికి అవసరమైన సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో పాటు.. తెలంగాణ పరిస్థితిని వివరించేందుకు త్వరలో మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లనుంది. ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది… సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు, సిబ్బంది, మౌలిక వసతులను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్‌నినో పరిస్థితులు, ఉష్ణోగ్రతల ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినట్లు కేబినెట్లో చర్చించారు. తెలంగాణలో సాధారణంగా రోజువారీ విద్యుత్ వినియోగం సుమారు 15 వేల మెగావాట్ల వరకు ఉండగా.. ఈ సీజన్లో పీక్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరింది. గత ఏడాది గరిష్ఠ డిమాండ్ 16,613 మెగావాట్లుగా ఉంది.
పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కేబినెట్ నిర్ణయించింది. అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 7,800 మెగావాట్ల కొత్త విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి.