అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పిన పచ్చి అబద్ధాలను సాక్ష్యాలతో సహా బయట పెడుతున్న..మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తూ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చెప్పిన అబ్ధాలను హరీశ్‌రావు..

అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పిన పచ్చి అబద్ధాలను సాక్ష్యాలతో సహా బయట పెడుతున్న.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

సమైక్య పాలనలో 1956 నుండి 2014 వరకు 60 ఏళ్ళల్లో తెలంగాణలో సాగు చేసిన ఆయకట్టు 42.77 లక్షల ఎకరాలు..

మనం సాధించుకున్న రాష్ట్రంలో 2014 నుండి 2023 వరకు మన తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో కొత్తగా 48.74 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు చేశాం అన్నారు..ఆనాడు మన రాష్ట్రనికి మేలు జరుగుతుందని పాలమూరు ప్రాజెక్ట్ కడితే.. రెండు సంవత్సరాల నుండి ప్యాకేజ్ 3లో ఉన్న బుడ్డ కాలువ పూర్తి చేయలేదు

అది పూర్తి చేసి ఉంటే ఈ సంవత్సరం 50 టీఎంసీల నీళ్లు నింపుకునే అవకాశం ఉండేది..

పాలమూరు బిడ్డ అంటావు పాలమూరు ప్రజలకు నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్, టీడీపీ ద్రోహం చేస్తే ఆ ద్రోహానికి పరంపరాన్ని కొనసాగిస్తున్నావు అంటు CM రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు..రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్..
మన విద్యార్థి, యువకులను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్..
మన ప్రాజెక్టులను రద్దు చేసింది కాంగ్రెస్..

రాష్ట్ర విభజన సమయంలో కూడా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను 11వ షెడ్యూల్‌లో పెట్టకుండా పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు…తెలంగాణకు బీఆర్‌ఎస్‌ ఏదో అన్యాయం చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, మోసాన్ని సరిదిద్ది తెలంగాణకు శాశ్వత నీటి హక్కులు పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించి ఇచ్చిన చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీది’ అని చెప్పారు.

‘కాంగ్రెస్‌ చేసిన ద్రోహాలను, తప్పులను, శనివారం వారు శాసనసభలో చెప్పిన అబద్ధాలను, తెలంగాణ నీటి హక్కులను కాపాడటానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చేసిన కృషిని నేను నా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో వెల్లడిస్తా. ఈ పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ రాజకీయాల కోసం కాదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నేను ఈ పీపీటీని మీ ముందు పెడుతున్నా. నేడు రాజకీయాలు అంటే పదవులు అన్నట్టుగా మారింది. కానీ మేం పదవులు కోసం పనిచేయట్లేదు. మాకు పదవులు శాశ్వతం కాదు, రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే శాశ్వతం’ అని హరీశ్‌రావు అన్నారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959