వరుస భూకంపాలు అఫ్గానిస్థాన్‌ కు వణుకు..!..

వరుస భూకంపాలు అఫ్గానిస్థాన్‌ను (Afghanistan) వణికిస్తున్నాయి. ఆదివారం రాత్రి సంభవించిన భూవిలయం నుంచి తేరుకోకక ముందే మళ్లీ భూమి కపించింది. శుక్రవారం ఉదయం గంటల వ్యవధిలోనే మూడు సార్లు ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. తొలుత తెల్లవారుజామున 3.16 గంటలకు 4.9 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు 5.2 తీవ్రతతో, 7.46 గంటలకు మరోసారి 4.6 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మొలజీ (NCS) తెలిపింది. మూడు భూకంపాలు రాజధాని కాబూల్‌కు 120 కిలోమీటర్ల దూరంలో సంభవించాయి..గురువారం రాత్రి కూడా రెండు సార్లు భూమి కంపించింది. తొలుత రాత్రి 10.26 గంటలకు 5.8 తీవ్రతతో భూమి కంపించగా, అనంతరం 11.58 గంటలకు 4.1 తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయి. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉన్నది. కాగా, ఆదివారం రాత్రి సంభవించిన భూకంపం వల్ల ఇప్పటివరకు 2200 మందికిపైగా మరణించారు. మరో 3640 మంది గాయపడ్డారు…