భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన రవీందర్ అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రవీందర్..
చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు..
ఇప్పటి వరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నలుగురు ఆర్టీసీ కార్మికులు..
నర్సంపేటలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శంకర్ గౌడ్ మృతి..
80% కాలిన గాయాలతో గ్రీన్ ఛానెల్ ద్వారా వరంగల్ ఎంజీఎం నుండి హైదరాబాద్ తరలిస్తుండగా, నగరానికి చేరుకున్నాక మృతి చెందిన శంకర్ గౌడ్ మృతి చెందగా…..
భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన రవీందర్ అనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
తీవ్ర అస్వస్థతకు గురైన రవీందర్ను ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల కాలంలో ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు నలుగురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆర్టీసీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు..