పుష్కరాల సమయంలో వారి శరీరాకృతులు ఎంతో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలాగే ఈ సమయాల్లో చాలామంది అఘోరాలను చాలా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. వీరు ప్రత్యేకమైన శక్తులు కలిగి ఉండడమే కాకుండా సాక్షాత్తు భగవంతులకు దగ్గరగా జీవిస్తారని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకే భారత్లో వీరికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. తాజాగా అఘోరీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విష్మయానికి గురిచేస్తోంది. మంచు కురుస్తున్న నిశీధి సమయంలో ఓ అఘోర అదే మంచులో గాల్లో తేలుతూ శివనామ స్మరణ చేస్తూ ఉండడం మీరు చూడొచ్చు.
అఘోరీ భక్తి అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు శివ భక్తులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియోలో మంచు కుప్పలు తిప్పలుగా కురుస్తున్న ప్రదేశం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా.. ఒక అఘోర తన శరీరం అంతట తెల్లటి విభూదిని పూసుకుని.. మెడలో భారీ రుద్రాక్షలు ధరించి.. భంగిమలు కూర్చుని ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తి తన రెండు కాళ్లతో పాటు శరీరాన్ని గాల్లో ఉంచి తేలిపోయాడు. పద్మాసన భంగిమలు కూర్చున్న అఘోరీ గాల్లోనే కూర్చుని ఓం నమశ్శివాయ అంటూ శివనామ స్మరణ చేస్తున్నాడు.
వీడియో ప్రారంభించినప్పటి నుంచి.. అఘోరీ తన గంభీరమైన గొంతుతో ఎంతో భక్తితో ఓం నమశ్శివాయ.. హరహర మహాదేవ అంటూ ఆ మహా శివుడిని గట్టిగా తలుచుకుంటూ ఉండడం మీరు చూడొచ్చు. ఆ మంచు కొండల నిశ్శబ్దానికి.. అతడి పలుకుతున్న శివనామ స్మరణ ఎంతో గంభీరంగా వినిపిస్తూ ఉంది. అంతేకాకుండా అతనిపై నుంచి ఎంతో మంచు పడుతున్నప్పటికీ.. భారీగా గాలులు వేస్తున్నప్పటికీ ఏమాత్రం కదలకుండా శివార్చనలో మునిగిపోయాడు.. ఇలా వీడియోలో కొద్దిసేపు ఓం నమశ్శివాయ అంటూ శివనామ స్మరణ చేస్తూనే కనిపించాడు.
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. కొంతమంది ఈ వీడియో చూసినవారు ఇది ఓ అద్భుతమైన యోగశక్తి అని.. కేవలం ఇది కొంతమందికి మాత్రమే ఉంటుందని వారు అంటున్నారు. ముఖ్యంగా హిమాలయాల్లో ప్రత్యేకమైన సాధనలు చేసేవారు ఇలాంటి శక్తులు కలిగి ఉంటారని వారు చెబుతూ వస్తున్నారు. ఇక మరికొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అఘోర నిజమైనప్పటికీ.. ఆయన గాల్లో తేలడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా సృష్టించిందని చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో క్లియర్గా పరీక్షిస్తే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిందేనని తెలుస్తోంది.
ఏఐ ద్వారా ఇలాంటి ఎన్నో క్రియేట్ చేయొచ్చు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు..