AK-203: నిమిషానికి 700 బుల్లెట్లు

AK-203: నిమిషానికి 700 బుల్లెట్లు

భారత సైన్యానికి IRRPL AK-203 అసాల్ట్ రైఫిల్స్ సరఫరా చేస్తోంది. ఈ మేడిన్ ఇండియా గన్స్ AK-47, AK-57కంటే అద్మతనమైనవి. 4 కిలోల బరువుండే ఈ రైఫిల్స్ నిమిషానికి 700 బుల్లెట్లను పేల్చగలవు. బుల్లెట్ 800 మీటర్ల రేంజ్ వరకూ దూసుకెళ్తుంది. ఈ రైఫిల్ నిక్ నేమ్ ‘షేర్’. మూడు దశాబ్దాల నుంచి మిలిటరీ ఉపయోగిస్తున్న ఇన్సాస్ రైఫిళ్లను కాదని ఇండియన్ మిలిటరీ వీటిని ఉపయోగించనుంది….

భారత సాయుధ దళాలకు 6,01,427 ఏకే-203 తుపాకులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో భారత్‌-రష్యా భాగస్వామ్యంతో ఏర్పాటైన ‘ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ (IRRPL) సంస్థ ‘షేర్’ బ్రాండ్‌ పేరుతో ఏకే-203 తుపాకులను తయారు చేస్తోంది.
రూ.5,200 కోట్ల విలువైన కాంట్రాక్టులో భాగంగా 2032 అక్టోబర్‌ నాటికి మొత్తం 6,01,427 ఏకే-203 తుపాకులను భారత సాయుధ దళాలకు అందించాల్సి ఉంది.
అయితే ప్రణాళికలో పేర్కొన్న సమయం కంటే 22 నెలల ముందుగానే,అంటే 2030 నాటికే వీటిని సైన్యానికి అందజేస్తామని సంస్థ సీఈఓ,మేనేజింగ్‌ డైరెక్టర్‌ మేజర్‌ జనరల్‌ ఎస్‌.కె.శర్మ వెల్లడించారు.
ఇప్పటివరకూ దాదాపు 48,000 తుపాకులను అందజేశామని, మరో రెండు నుంచి మూడు వారాల్లోగా 7,000 తుపాకులను అదనంగా అందించనున్నామని ఆయన వివరించారు.
డిసెంబర్‌ నాటికి మరో 15,000 తుపాకులను భద్రతా దళాలకు ఇవ్వనున్నట్లు తెలిపారు..

అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చేయబడిన ఈ ‘షేర్’ తుపాకులు,ఇప్పటికే సాయుధ దళాల్లో వినియోగంలో ఉన్న ఏకే-47, ఏకే-56 తుపాకులతో పోల్చితే మరింత ఆధునికమైనవిగా పేర్కొనబడుతున్నాయి.
కలాష్నికోవ్‌ సిరీస్‌లో అత్యంత ప్రమాదకరమైన తుపాకులుగా వీటిని భావిస్తున్నారు.
ప్రస్తుతం సైన్యం ఉపయోగిస్తున్న ఇన్సాస్‌ తుపాకులకు బదులుగా ఈ ఏకే-203 తుపాకుల వినియోగాన్ని పెంచేందుకు ఆర్మీ యోచిస్తోంది.
ఇన్సాస్‌ తుపాకుల కాలిబర్‌ 5.62 ఎంఎం కాగా, ఏకే-203 తుపాకుల కాలిబర్‌ 7.62 ఎంఎం. బరువు పరంగా చూస్తే,ఇన్సాస్‌ తుపాకీ బరువు 4.15 కేజీలు కాగా,ఏకే-203 తుపాకీ బరువు కేవలం 3.8 కేజీలే. పొడవు కూడా తక్కువగా 705 ఎంఎం మాత్రమే ఉంది..