అఖండ 2′ వాయిదా.. కారణాలు ఏంటి?.

నందమూరి బాలయ్య లేటెస్ట్ గా నటించిన అఖండ 2 సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్లు ఇవాళ రాత్రి 8 గంటలకు పడాల్సి ఉంది..కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ప్రీమియర్లు వేయలేకపోతున్నట్లు చిత్ర బృందం సాయంత్రం ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లంతా గందరగోళానికి గురవుతున్నారు.

ఓవర్సీస్ లో మాత్రం అఖండ 2 ప్రీమియర్లు పడిపోనున్నాయి. అయితే, ఇలా అర్ధాంతరంగా ప్రీమియర్లు ఆగిపోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దినంతటికీ కారణం మహేష్ బాబు సినిమాలని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అఖండ 2 సినిమా ప్రెసెంట్ చేస్తున్న 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ, ఈరోస్ సంస్థకు డబ్బులు చెల్లించాల్సిన వివాదం ఇంకా కొనసాగుతోందట…

అఖండ చిత్రాన్ని నిర్మించిన చిత్ర నిర్మాణ సంస్థ ఏమని ట్వీట్ చేసిందంటే….అనివార్య పరిస్థితుల కారణంగా అఖండ 2 మూవీని షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని మీకు తెలియజేయడానికి బరువెక్కిన హృదయంతో చింతిస్తున్నాము. ఇది మాకు బాధాకరమైన క్షణం, మరియు సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రతి అభిమాని మరియు సినీ ప్రేమికుడికి ఇది కలిగించే నిరాశను మేము అర్థం చేసుకోగలం. అయితే ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో మీకు సానుకూలమైన అప్డేట్ అందిస్తామంటూ ప్రకటించింది…
దీంతో ఈ సినిమా విడుదలకు ఎదురు చూస్తున్న అభిమానులు ఈ నిర్ణయంతో ఒకసారి షాక్ అయ్యారు. ఉదయాన్నే బుకింగ్స్, షెడ్యూల్ విషయాల్లో గందరగోళం, అనిశ్చితి కనిపించగా, సాయంత్రానికి ప్రీమియర్ ప్రదర్శనలు రద్దుకావడంతో పరిస్థితి మరింత స్పష్టమైంది. చివరికి ఇప్పుడు సినిమా విడుదలే వాయిదా పడింది. బాలకృష్ణ లాంటి ఒక స్టార్ హీరో సినిమా ఇలా ఆర్థిక ఇబ్బందులతో వాయిదా పడటం అసలు ఎవరు ఊహించని విషయం..
ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలుండగా, వాయిదా నిర్ణయం అభిమానులతో పాటు సినీ వర్గాలను కూడా దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం కొత్త విడుదల తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో నిర్మాణ సంస్థ ఏమి చెయ్యబోతుందో అని ఉత్కంఠ నెలకొంది.

దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ (అంచనా) తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కావడం కూడా ఈ సినిమా పై భారీ అంచనాలకు మరో కారణం. బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు..

అఖండ 2′ వాయిదాకి కారణాలు ఏంటి?.

సాంకేతిక కారణాల వల్ల ‘అఖండ 2’ ప్రీమియర్స్‌ని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించింది ‘అఖండ 2’ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్. అయితే ‘అఖండ 2’ వాయిదా పడేందుకు 11 ఏళ్ల క్రితం ఈ బ్యానర్‌లో తెరకెక్కిన రెండు మహేష్ సినిమాలే కారణమని తెలుస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ సినిమాలు భారీ నష్టాలను తీసుకొచ్చాయి. ఈ సినిమాలను Eros ఇంటర్నేషనల్ మీడియా డిస్టిబ్యూట్ చేసింది. నష్టాలు వస్తే, తిరిగి చెల్లించేస్తామనే ఒప్పందం కూడా జరిగింది.

అలా ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ సినిమాలకు కలిపి దాదాపు రూ.16 కోట్లకు పైగా నష్టాలు చవి చూసింది Eros ఇంటర్నేషనల్. 11 ఏళ్లుగా ఆ మొత్తానికి వడ్డీతో కలిపి రూ.28 కోట్లు చెల్లించాలని మద్రాస్ హైకోర్టుకి వెళ్లిన Eros సంస్థ, ‘అఖండ 2’ మూవీ రిలీజ్‌పై స్టే తీసుకొచ్చింది.

చెల్లించని బకాయిలు..

‘అఖండ 2’ మూవీకి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. అయితే ఓ ఏరియా రైట్స్ తీసుకున్న ప్రముఖ డిస్టిబ్యూటర్, చెల్లించాల్సిన మొత్తంలో సగానికి సగం కూడా ఇవ్వలేదట. దీంతో ఆఖరి నిమిషంలో నిర్మాణ సంస్థకి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ‘అఖండ 2’ మూవీకి పని చేసిన సాంకేతిక సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ సాంకేతిక సిబ్బంది, నిర్మాతల కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు…

పెరిగిపోయిన బడ్జెట్..
బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన గత మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. దీంతో ‘అఖండ 2’ మూవీకి భారీగా ఖర్చు చేశారు నిర్మాతలు. ఈ మూవీకి రూ.200 కోట్ల వరకూ బడ్జెట్ అయ్యింది. రిలీజ్‌కి ముందే ఓటీటీ డీల్ ద్వారా మంచి మొత్తం వెనక్కి వచ్చేసింది కూడా.. అయితే సెప్టెంబర్‌లో రావాల్సిన మూవీ, డిసెంబర్ దాకా వెళ్లడం బడ్జెట్ బౌండరీలు దాటింది. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయాలనుకోవడం వల్ల, ప్రమోషన్స్ భారీగా చేయడం వల్ల మరింత ఖర్చు పెరిగింది. ఈ ఖర్చులన్నీ ‘అఖండ 2’ రిలీజ్‌కి అడ్డంకులు తీసుకొచ్చినట్టు సినీ సర్కిల్స్ లో పేర్కొంటున్నారు…