*ముగిసిన అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు విచారణ!.
* *వర్చువల్ గా హాజరైన నటుడు.
* *బెయిల్ పై తదుపరి విచారణ సోమవారానికి వాయిదా.
* *ఘటన విచారణ జనవరి 10కి వాయిదా.
*సంధ్య థియేటర్ ఘటనలో* ప్రముఖ నటులు అల్లు అర్జున్ కు గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియడంతో మరోసారి విచారణకు హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు నేరుగా వెళ్ళవలసి ఉండగా.. ఆన్-లైన్ ద్వారా హాజరయ్యారు. ఇదే కేసులో అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయాన్ని ఆయన లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అల్లు అర్జున్ పై కౌంటర్ బెయిల్ పిటిషన్ దాఖలుచేయడానికి పోలీసులు సమయం కోరడంతో కోర్టు బెయిల్ విచారణను డిసెంబర్ 30 సోమవారంకు వాయిదావేశారు. ఇంకోవైపు సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన విచారనను సైతం నాంపల్లి కోర్టు జనవరి 10కి వాయిదావేసింది.