అల్లు అర్జున్ జాతకంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!

అనంతరం వేణు స్వామి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. తన తండ్రి చేతివేస్తే స్పందిస్తున్నాడు. ఆ పిల్లవాడు కంటి వెంట నీరు రావడం నేను చూశాను. ప్రస్తుతం వెంటిలేటర్, ఆక్సిజన్ సహాయం లేకుండా నార్మల్గానే చికిత్స తీసుకుంటున్నాడని, కచ్చితంగా త్వరలో శ్రీ తేజ్ కోరుకుంటాడని ఆశిస్తున్నాను అని తెలిపారు. బాబు కోసం ఈ వారంలో తాను మృత్యుంజయ యజ్ఞాన్ని తన సొంత డబ్బులతో నిర్వహించబోతున్నానని వేణు స్వామి ప్రకటించాడు..

ఈ సమయంలో అల్లు అర్జున్ జాతకంపై వేణు స్వామి షాకింగ్ కామెంట్ చేశారు. అల్లు అర్జున్ జాతకంపై శని ప్రభావం ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, అతని జాతకం వచ్చే ఏడాది మార్చి 29 వరకు బాగోలేదని, కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు జరుగుతుంటాయని పేర్కొన్నారు. ప్రతి ఒకరి జీవితంలో ఇలాంటి కష్టాలు చోటు చేసుకుంటాయని, వాటిని తట్టుకొని ముందుకు సాగిపోవడమే అంటూ చెప్పుకొచ్చారు..

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సినిమా సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ జ్యోతిష్యం చెబుతూ వార్తల్లో నిలిచారు. స్టార్‌ హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ఫేమస్‌ అయ్యారు. అంతేకాదు హీరోయిన్ల దోషాలు పోవడం కోసం పూజలు కూడా నిర్వహించారు…హీరో అల్లు అర్జున్ జాతకంలో శని ఉండడం వల్ల.. ఈ సంఘటన చోటు చేసుకుందని వేణు స్వామి వివరించారు. వచ్చే ఏడాది మార్చి 29వ తేదీ వరకు అల్లు అర్జున్ జాతకం ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. కాస్తా జాగ్రత్తగా ఉండాలంటూ హీరో అల్లు అర్జున్‌కు వేణు స్వామి సూచించారు. ఇక ఎవరు కావాలని ఏదీ చేయరన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పొప్పులు ఉంటాయన్నారు. ..