అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు..ఇరాన్ ప్రతీకార దాడులు..

ఈస్ట్‌లో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై అమెరికా తాజా దాడుల తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది..ఇరాన్ మంగళవారం రాత్రి జోర్డాన్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. జోర్డాన్‌లో సైరన్లు మోగగా, ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించిన 13 ఇరాన్ క్షిపణుల్లో పదింటిని వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మిగిలిన మూడు క్షిపణులు జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో పడినట్లు జోర్డాన్ సాయుధ దళాలు వెల్లడించాయి.

జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై జరిగిన దాడుల్లో అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఇరాన్‌కు చెందిన IRGC మాత్రం జోర్డాన్‌లోని క్యాంప్ టిటిన్‌పై దాడి చేసి భారీ సంఖ్యలో అమెరికా సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది..