ఆమెరికాలోని ఉటా (Utah) నివాసి అయిన కెల్సీ మికెల్సన్ ప్రస్తుతం 34 ఏళ్ల వయసులో ఉంది. ఆమె 17 ఏళ్ల వయసులో ఎదుర్కొన్న ఒక అనుభవం మెడికల్ సైన్స్లో ఒక అరుదైన ఉదాహరణగా నిలిచింది..
శారీరక సమస్య మరియు వైద్యుల సలహా:
కెల్సీకి 15 ఏళ్ల వయసులో తన ప్రైవేట్ పార్ట్ ఓపెనింగ్ చాలా చిన్నదిగా ఉందని తెలిసింది. పీరియడ్స్ సమయంలో కనీసం టాంపాన్లను వాడటం కూడా ఆమెకు సాధ్యం కాలేదు. వైద్యులు పరీక్షించి ఆమెకు ‘హైమెన్’ (Hymen) పొర అదనంగా పెరిగిందని, దీనివల్ల శారీరక సంబంధం పెట్టుకోవడం అసాధ్యమని చెప్పారు. 18 ఏళ్లు నిండాక ‘హైమెనెక్టమీ’ (Hymenectomy) అనే సర్జరీ చేయించుకోవాలని సూచించారు.
సంబంధం లేకుండా గర్భం ఎలా వచ్చింది?
కెల్సీ 16 ఏళ్ల వయసులో ‘జాక్’ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. తన సమస్య గురించి అతనికి ముందే వివరించడంతో వారిద్దరి మధ్య ఎప్పుడూ కలయిక (Penetration) జరగలేదు. అయితే, ఒక రాత్రి వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో, శారీరక కలయిక జరగకపోయినా వీర్యం (Sperm) యోని మార్గం వెలుపల పడింది.
మెడికల్ వివరణ: వీర్యం యోని వెలుపల పడినప్పటికీ, అందులోని శుక్రకణాలు సహజమైన తేమ సహాయంతో లోపలికి ప్రయాణించి గర్భధారణకు కారణం కావచ్చు.
షాకింగ్ రిజల్ట్: కొద్దిరోజుల తర్వాత కెల్సీకి పీరియడ్స్ రాకపోవడంతో టెస్ట్ చేయగా పాజిటివ్ అని వచ్చింది. ఆమె ఏ సంబంధం పెట్టుకోలేదని చెప్పినా మొదట ఎవరూ నమ్మలేదు. కానీ డాక్టర్లు పరీక్షించి ఆమె రెండు నెలల గర్భవతి అని, పైన చెప్పిన కారణం వల్లే ఇది జరిగిందని నిర్ధారించారు.
తర్వాత ఏం జరిగింది?
కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మొదట ఆమెను నమ్మకపోయినా, వైద్యుల వివరణతో వాస్తవాన్ని గ్రహించారు. 2009లో ఆమె తన మొదటి కుమార్తెకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో ఆమెకున్న అదనపు చర్మం సహజంగానే తొలగిపోయి పరిస్థితి సాధారణమైంది. ప్రస్తుతం కెల్సీ మరియు జాక్ వివాహం చేసుకుని ఐదుగురు పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959