అనకాపల్లి జిల్లాలో భారీ పాము కలకలం….!

అనకాపల్లి జిల్లాలో భారీ పాము కలకలం..

అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లిలో 15 అడుగుల భారీ పాము రైతులను భయపెట్టింది.

పొలాల్లో కుక్కలు అడ్డుకోవడంతో పాము రైతులపై దూసుకొచ్చింది….రైతులు భయంతో పరుగులు తీశారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనకాపల్లి జిల్లాలోని దేవర పల్లిలో ( Devara pally) ఏకంగా 15 అడుగుల భారీ పాము… పొలాల్లోకి చొరబడింది. దీంతో.. అక్కడే ఉన్న రైతులు ( Farmers) గజగజ వణికిపోయారు. పొలాల్లోకి వచ్చిన ఆ భారీ పాము… అక్కడే ఉన్న రైతులను… పరుగులు పెట్టించింది. అయితే పొలాల్లో కుక్కలు ( Dogs) అడ్డుకోవడంతో…. రైతులపైకి ఆ పాము దూసుకు వచ్చింది.

అయితే 15 అడుగుల భారీ పాము తమ పైకి రావడంతో.. ప్రాణాలు కాపాడుకునేందుకు రైతులు కూడా పరుగులు తీశారు. ఈ నేపథ్యంలోనే రైతులపైకి పాము దూసుకు వచ్చిన వీడియో… సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అటు ఈ వీడియోని చూసిన నెటిజెన్స్… షాక్ అవుతున్నారు. ఏంటి పాము ఇంతలా ఉంది? 15 అడుగులు ఉంటుందా? అని కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ పాము ఏ జాతికి చెందింది? పామును ఏమని పిలుస్తారు ? అని కూడా సోషల్ మీడియా వేదికగానే ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్. అయితే సోషల్ మీడియాలో ఇలా పాముల వీడియోలు రావడం చాలా కామన్. అనకాపల్లి ఫారెస్ట్ ఏరియాకు దగ్గరే ఉంటుంది కాబట్టి… పెద్దపెద్ద పాములు వస్తూ ఉంటాయి…