తనపై లైంగిక దూషణలు చేస్తున్నారంటూ CCSలో నటి అనసూయ కంప్లైంట్..
లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు చేస్తూ తప్పుడు రాతలు రాస్తున్నారంటూ అనసూయ ఫిర్యాదు
కరాటే కళ్యాణి, శేఖర్ భాష సహా పలువురు టీవీ యాంకర్లు, సామాజిక మాధ్యమ ఖాతాదారులతో కలిపి 73 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు..
టీవీ డిబేట్లలో తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ ఆమె పోలీసులకు తన ఫిర్యాదు తెలిపారు.
ఈ మేరకు కాంగ్రెస్ నాయకురాలు బొజ్జ సంధ్యారెడ్డితో పాటు మొత్తం 73 మందిపై పోలీసులు FIR నమోదు చేశారు. తనపై వేధింపులు మొదలయ్యాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన కామెంట్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు ఉద్దేశపూర్వకంగా ఈ ఇష్యూని పెద్దది చేశాయని, టీవీ డిబేట్ల వల్ల తనకు లైంగిక వేధింపులతో పాటు ప్రాణహాని బెదిరింపులు కూడా వస్తున్నాయని అనసూయ తెలిపారు.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959