నేటి పంచాంగం.. నేటి విశేషం..

ఓం శ్రీ గురుభ్యోనమః
🥀పంచాంగం🥀
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 17 – 01 – 2026
వారం … స్థిరవాసరే ( శనివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,

తిథి : *చతుర్దశి* రా11.57 వరకు,
నక్షత్రం : *మూల* ఉ8.38 వరకు
యోగం : *వ్యాఘాతం* రా10.05 వరకు,
కరణం : *భద్ర* ఉ11.06 వరకు
తదుపరి *శకుని* రా11.57 వరకు,

వర్జ్యం : *ఉ6.52 – 8.38*
మరల *రా7.03 – 8.47*
దుర్ముహూర్తము : *ఉ6.37 – 8.06*
అమృతకాలం : *తె5.28 నుండి*
రాహుకాలం : *ఉ9.00 – 10.30*
యమగండం : *మ1.30 – 3.00*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం : 5.42,

*_నేటి విశేషం_*
*ముక్కనుమ మరియు మాస శివరాత్రి*
*_𝕝𝕝ॐ𝕝𝕝 ముక్కనుమ – సావిత్రి గౌరీదేవి వ్రతo 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*‘ముక్కనుమ’ నాడు సావిత్రి గౌరీదేవి వ్రతం చేస్తే చాలా మంచిది…!!*
కనుమ మరుసటి రోజుని *’ముక్కనుమ’* గా పిలుచుకుంటూ వుంటారు.

ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము( సావిత్రి గౌరీ నోము) చేస్తారు, సావిత్రి గౌరీదేవి వేదమాత.
ఈ దేవతను గూర్చి వరహ , బ్రహ్మవైవర్త , పద్మ పురాణాలు , దేవీ భాగవతం వివరిస్తున్నాయి. స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోమును తొమ్మిది రోజులు చేయాలి.
దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు.

ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.
వివాహం కావలసిన కన్నెపిల్లలు కూడా ఈ బొమ్మలనోములో పాల్గొంటూ వుంటారు.
ముత్తయిదువులను పేరంటానికి పిలిచి , మట్టిబొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని వుంచి పూజిస్తారు.
అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తయిదువులకు పండ్లు , తాంబూలం వాయనంగా ఇస్తారు.

ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మలనోము చేయించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని అంటారు.
కన్నెపిల్లలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తుంటారు.
ఇలా ముక్కనుమ కూడా ఈ బొమ్మలనోము ద్వారా కోరిన వరాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ వుంటుంది.

*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏