యాంకర్ శ్రీముఖి కూడా ఆ లిస్టులో చేరింది. (Sreemukhi) ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది.
Anchor Sreemukhi..
ఈ సందర్భంగా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లను పొగడ్తలతో ముంచెత్తడానికి ప్రయత్నించి.. పురాణ పురుషులైన రామలక్ష్మణులను కల్పిత పాత్రలు అంటూ హిందువులకు ఆగ్రహం తెప్పించింది. “రామ్ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్. కానీ సాక్షాత్తూ నా కళ్ళ ముందు కూర్చున్నారు..
ఒకరు దిల్ రాజు అయితే, ఇంకొకరు శిరీష్ గారు” అంటూ శ్రీముఖి కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలపై హిందూ సమాజం భగ్గుమంటోంది. శ్రీముఖి వెంటనే తన కామెంట్స్ ని వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. వివాదం మరింత ముదరకముందే శ్రీముఖి క్షమాపణలు చెబుతుందేమో చూడాలి.