తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేర’ని చెప్పడానికి మరో సాక్ష్యం!
నేపాల్లో వరదలు ముంచుకొచ్చిన సమయంలో.. ఓ తల్లి ఎంతో ధైర్యసాహసాలతో తన పిల్లల్ని కాపాడుకుంది
వరద రూపంలో మృత్యువు ముంచుకొస్తున్నా.. పిల్లల చేతులు వదలకుండా సెకన్ల వ్యవధిలోని రక్షించుకుంది
తాను కింద పడ్డా సరే.. వెంటనే లేచి తన పిల్లల్ని తీసుకొని కొండ ప్రాంతం వైపుకు వెళ్లింది
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. తల్లి ధైర్యసాహసాల్ని చూసి ప్రశంసలు కురిపిస్తున్న జనం
రెండు సెకన్లు ఆలస్యమైనా పిల్లలు కొట్టుకుపోయేవారని.. భయపడకుండా సమయస్ఫూర్తితో పిల్లల్ని కాపాడుకున్న ఆ తల్లికి జోహార్లు అంటూ కామెంట్లు
తల్లిని మించిన యోధురాలు ఎవ్వరూ లేరు.. ఇదిగో మరో సాక్ష్యం!
వరద ఉధృతిలో పిల్లల్ని కాపాడుకున్న తల్లి.. వీడియో వైరల్
https://x.com/pulsenewsbreak/status/2093868302900879429?s=20నేపాల్లో: వరదలు ఒక్కసారిగా ముంచుకొచ్చిన వేళ ఓ తల్లి చూపించిన ధైర్యసాహసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రాణాలను హరించేంత వేగంగా వరద నీరు దూసుకొస్తున్నా.. తన పిల్లల చేతులను మాత్రం ఆ తల్లి వదల్లేదు.
వరద ప్రవాహం ప్రమాదకరంగా మారుతున్న సమయంలో పిల్లలను పట్టుకుని అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తాను కిందపడిపోయినా.. ఏమాత్రం భయపడకుండా వెంటనే పైకి లేచి పిల్లలను తీసుకుని సురక్షితమైన కొండ ప్రాంతం వైపు పరుగులు తీసింది.
కేవలం కొన్ని క్షణాల్లోనే తీసుకున్న నిర్ణయం.. పిల్లల ప్రాణాలను కాపాడింది!
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ తల్లి ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు.
“తల్లి ప్రేమకు మించిన రక్షణ లేదు”, “ఆమె సమయస్ఫూర్తికి సెల్యూట్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఒక్క క్షణం ఆలస్యమైనా పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేదని.. ప్రాణాలకు తెగించి పిల్లలను కాపాడుకున్న ఆ తల్లికి నెటిజన్లు వందనం చేస్తున్నారు