AP 10వ తరగతి హాల్ టికెట్ 2026 విడుదల.!

AP 10వ తరగతి హాల్ టికెట్ 2026 విడుదల!

ఏపీ SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ వెంటనే తమ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి. పరీక్ష హాల్‌లో ప్రవేశానికి హాల్ టికెట్ తప్పనిసరి..

అధికారిక వెబ్‌సైట్లో ప్రింటెడ్ హాల్ టికెట్ అందుబాటులో ఉంటుంది, దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో విద్యార్థి పేరు, క్రమ సంఖ్య, ఫోటోగ్రాఫ్, పరీక్ష కేంద్రం తదితర వివరాలు ఉంటాయి. దాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలి. అడ్మిట్ కార్డులో ఏవైనా తప్పిదాలు ఉంటే వెంటనే స్కూల్ యాజమాన్యానికి వెళ్లి సరి చేసుకోవాలి. ప్రతిరోజు ఈ హాల్ టికెట్స్ పరీక్షాకేంద్రానికి విద్యార్థి తనతోపాటు తీసుకువెళ్లడం ఎంతో ముఖ్యం. లేకపోతే పరీక్ష కేంద్రం లోపటికి హాజరు కానివ్వరు.

AP SSC హాల్ టికెట్స్ 2026 డౌన్‌లోడ్ చేసుకునే విధానం ..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ఓపెన్ చేయండి. హోంపేజీలో ‘ఏపీ ఎస్‌ఎస్‌సీ హాల్ టికెట్స్ 2026’ కనిపిస్తుంది. మీ లాగిన్ క్రెడియన్షియల్స్ ఆధారంగా వివరాలు నమోదు చేసి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవాలి.

ఏపీ పది పరీక్షలు ఎప్పుడంటే?
2026 మార్చి 16వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు 45 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. .
వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే విధానం..
విద్యార్థులు వాట్సాప్ లో కూడా సులభంగా ఈ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మన మిత్ర వాట్సాప్ గవర్నమెంట్ నంబర్ 9552300009 లేదా లీప్ అప్లికేషన్ ద్వారా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆధారంగా వాటి గైడ్ లైన్స్ తో మీరు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

503 Error సమస్య వస్తే..
అయితే విద్యార్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ రోజు ఎక్కువగా సెర్చ్‌ ట్రాఫిక్ ఉండటం వల్ల ఓపెన్ అవ్వట్లేదు. ఆన్‌లైన్లో డౌన్‌లోడ్ చేయడంలో తరచూ 503 Error సమస్య వస్తుంది. ఓవర్ లోడ్ సర్వర్ అవడం వల్ల ఇలాంటి మెసేజ్ కనిపిస్తుంది. దీనికి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. విద్యార్థులు కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సులభంగా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సెర్చ్‌ ఇంజిన్‌ మార్చండి..
1. కేవలం గూగుల్‌ క్రోమ్‌లో మాత్రమే కాకుండా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజ్ చేసి చూడండి.
2. అది కాకుంటే పీక్ సమయాల్లో కాకుండా ఉదయం లేదా రాత్రి వేళల్లో ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పుడు లాగిన్ అవ్వండి.
3. ఇన్‌కాగ్నిటో మోడ్లో సైట్ ఓపెన్ చేస్తే కూడా హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
4. పేజ్ రిఫ్రెష్‌మెంట్ F5 క్లిక్ చేసి చూడండి. సమస్య అలాగే కొనసాగితే కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేయండి..

🔗 *Download Now:*
https://bse.ap.gov.in/htttsix/HallTicketsSel.aspx

హాల్ టికెట్‌లోని వివరాలు జాగ్రత్తగా పరిశీలించండి..

తప్పనిసరిగా ప్రింట్ కాపీ తీసుకెళ్లండి
పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోండి