ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల నియామకం…
APSFTVTDC ఛైర్మన్ గా పి. భరత్ భూషణ్ నియామకం…
వైస్ ఛైర్మన్గా డైరెక్టర్ మెహర్ రమేష్ నియామకం…
ఛైర్మన్, వైస్ ఛైర్మన్తో పాటు మరో 14 మందిని సభ్యులుగా నియమించిన ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా, టెలివిజన్ , రంగస్థల రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకాలను అధికారికంగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కీలక ఉద్యోగ నియామకం..
కార్పొరేషన్ ఛైర్మన్ గా.. సంస్థకు కొత్త జవసత్వాలు అందించే బాధ్యతను పి. భరత్ భూషణ్ కి అప్పగించారు. చైర్మన్ హోదాలో ఆయన కార్పొరేషన్ భవిష్యత్తు ప్రణాళికలను ముందుండి నడిపిస్తారు. సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి చిక్కాల మెహర్ రమేష్ కుమార్ ను వైస్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. కేవలం చైర్మన్, వైస్ చైర్మన్లకే పరిమితం కాకుండా.. పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఈ బోర్డులో స్థానం కల్పించారు. చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు మరో 14 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం తగిన కమిటీని ఏర్పాటు చేసింది.